విద్యారంగానికి పెద్దపీట హర్షణీయం

సీఎం వై.ఎస్.జగన్ కు వైఎస్సార్ టీఎఫ్ అభినందనలు

వరిమడుగు వెంకటారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఈ ఏడాది 2021 -22 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బడ్జెట్ అంచనా 2,29,779.27 కోట్లు ఉండగా,  దానిలో విద్యారంగానికి పెద్దఎత్తున కేటాయింపు చేయడం శుభపరిణామమని వైఎస్సార్ టీఎఫ్ ప్రకాశంజిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వరిమడుగు వెంకటారెడ్డి, దండమూడి శాంతారావు హర్షం వ్యక్తంచేశారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలతో పాటు విద్య, వైద్యం, రైతాంగానికి పెద్దపీట వేశారని వారు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ గా ఉందని వారు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

దండమూడి శాంతారావు
 ముఖ్యంగా విద్యారంగానికి 24,624  కోట్లు కేటాయించడం శుభపరిణామం దానిలో పాఠశాల నాడు నేడు కోసం 3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం పన్నెండు వందల కోట్లు, జగనన్న విద్య కానుక కోసం 750 కోట్లు, ఉన్నత విద్యకోసం 1,973 కోట్లు, అంతే కాకుండా అమ్మఒడి పథకానికి 6,107 కోట్లు కేటాయించిన సీఎం గారికి వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్  ప్రకాశంజిల్లా తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని వారు పేర్కొన్నారు.   

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


  

     

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: