సేవామాతృమూర్తులు నర్సులు

నర్సులు సేవలు వెలకట్టలేనివి

హిందూపురం అఖిలపక్షం నేతల ప్రశంస


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సంధర్బంగా నర్సుల సేవలను కొనియాడుతూ హిందూపురం అఖిలపక్షం నేతలు గులాబీ పూలతో గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..సమాజం లో నర్సులు కు ప్రత్యేక స్థానం ఉందని  వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి వైద్యవృత్తిలో సమయం తెలియక ఒక కుటుంబం లో తల్లి లాగా సోదరిలా  శ్రామిస్తూ ప్రతిఒక్కరోగిని ఆత్మీయం గా పలకరించి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వైద్య సేవలు అందిస్తూ మానవతను  చాటుతున్న గొప్ప మానవతా మూర్తులు నర్సుల ని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు   అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అఖిలపక్షం నాయకులు ప్రభుత్వ  ఆసుపత్రి లో విధుల్లో ఉన్న నర్సులు కు పుష్పగుచ్ఛం ఇచ్చి గులాబీ పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 


కరోనా కష్టకాలంలో ప్రాణాలు తెగించి శ్రమిస్తున్నారని కరోనా రోగులకు వైద్య సేవలు తో పాటు    మానసికంగా మనోధైర్యాన్ని కల్పిస్తూ వారిని తమ సేవలతోను ఆరోగ్యవంతులు గా చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలాజీ మనోహర్, డి.ఇ.రమేష్ కుమార్, బీఎస్పీ శ్రీరాములు, ఇ ఎస్ వెంకటేష్ ముస్లిం నగారా అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్.టిప్పు బ్రిగేడ్ అతీఖుర్రహమాన్. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం షేక్ షబ్బీర్.టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఇనాయతుల్లా, దుర్గ నవీన్ నాగేంద్ర  హరీష్, సమీవుల్లా  షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: