సొంత బాటనా...కమలం బాటనా...?

టీఆర్ఎస్ కు రాజీనామా యోచనలో ఈటెల...?

ఆయనపై అవినీతి ఆరోపణలు తేల్చిన విచారణ కమిటీ

ఈటెల ముందు కనిపించని మరోమార్గం

టీఆర్ఎస్ కు ఈటెల రాజీనామా తప్పదా...?

తనవైపు లాక్కొనేందుకు బీజేపీ యత్నాలు

రంగంలోకి దిగిన కమలం పెద్దలు

టీఆర్ఎస్ లోని ఇతర అసంతృప్తులకు గాళం

అదునుచూసి అస్త్రాలను పదునుపెడుతున్న కమలం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

గత కొన్నేళ్లుగా స్థబ్దతంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా రంజుగా మారాయి. మంత్రి ఈటెల పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసీఆర్ సర్కార్ విచారణ చేయించిన విషయం తెలిసిందే. ఈ విచారణ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాకు పాల్పడినట్ల కూడా తేల్చింది. ఈ విచారణ నివేదిక రాకముందే ఈటెల శాఖలను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్రవేశారు. ఇద్దంతా కేసీఆర్ సూచనల మేరకు సాగిందన్నది బహిరంగంగా సాగుతన్న ప్రాచారం. దీంతో మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని విడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఆయన సొంత బాట పడతారా లేక ఇతర పార్టీలో ఏమైనా చేరుతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈటెల రాజేందర్ సొంతంగా ఓ పార్టీ పెడతారు అన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే ఆయన్ని తమ పార్టీలోకి లాగేందుకు కమలం నేతలు ఇప్పటికే ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. రంగంలోకి బీజేపీ హస్తీనా పెద్దలు దిగినట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించేవారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత ప్రభుత్వంపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నాటినుంను మంత్రి ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్ కు టార్గెట్ అయ్యారు అన్న ప్రచారం కూడా ఉంది.

రంగంలోకి కమలం పెద్దలు...?

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహానికి గురైన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణలో బలపడి అధికారంలోకి రావాలని యోచిస్తున్న బీజేపీ నాయకత్వం అధికార టీఆర్ఎస్ తోపాటు ఇతర ప్రతిపక్షాలలోని కీలక నేతలకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల టీఆర్ఎస్ ను వీడే పరిస్థితి రావడంతో ఆయనతో బీజేపీ జాతీయ నాయకత్వం నేరుగా సంప్రదింపులు చేసినట్లు సమాచారం. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ తో ఫోన్లో మంతనాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర పార్టీ నీ నుంచి ప్రతినిధులను ఈటల రాజేందర్ వద్దకు పంపించి మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రాష్ట్రంలో బలపడేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  యోచిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీలో సీనియర్ గా పేరుపొందిన బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ను అవమానకర రీతిలో ఉన్న మంత్రి పదవిని లాక్కోవడం తో బలహీన వర్గాల నాయకుల ను అణిచి వేస్తున్నట్లు ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. భూకబ్జా కేసులో ఇరికించి జైలుపాలు చేయాలనే యోచన లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కుటిల పన్నాగం తిప్పికొట్టేందుకు బిజెపి లో చేరడమే శ్రేయస్కరంగా ఈటల రాజేందర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన చర్చోపచర్చలు శనివారం మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా కొనసాగుతున్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి వచ్చిన బీజేపీ ప్రతినిధులు ఈటెల రాజేందర్ తో మంతనాలు జరుపుతున్న సమయంలో నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి స్వయంగా ఈటల రాజేందర్ మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమని కొందరు చెబుతుండా ఏది అవుతుందో వేచిచూద్దాం అన్న దిశగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: