జమాతే ఉలమా హింద్ ఆధ్వర్యంలో,,,
పండ్లు పంపిణీ
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
జమాతే ఉలమా హింద్ ఆధ్వర్యంలో శుక్రవారం రంజాన్ పండుగ సందర్బంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జమాతే ఉలమా హింద్ అధ్యక్షులు ఖలీల్ మౌలానా ఆధ్వర్యంలో ఎస్ఆర్బిసి కాలనీలో ఉన్న ఎయిడ్స్ బాధితులకు, పిల్లలకు ఆపిల్ పళ్ళు, దానిమ్మ, కమల, అరటి, ఖర్జూర పళ్ళు, వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఖలీల్ మౌలానా, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి smd యూనుస్ లు మాట్లాడుతూ రంజాన్ మాసంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పిల్లలు ముఖంలో కూడా నవ్వు చూడాలని మా వంతుగా సహాయం చేయడం జరిగిందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో బావా ఫక్రుద్దీన్, సలీమ్, కలాం భాష తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: