మనస్సాక్షి మేలుకొల్పింది

మీడియా వైఖరేమిటో ఇట్టే బట్టబయలైంది

ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభం పత్రికా రంగం(అది ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా). ఇంతటి ప్రాముఖ్యత మీడియా రంగానికి ఎందుకిచ్చారు అంటే స్వార్థ రాజకీయాలు పెరిగిపోయినపుడు, ప్రజల పక్షాన గొంతై నిలిచేందుకే పత్రికా రంగానికి అంతటి ప్రాముఖ్యత ఇచ్చారు. వాస్తవానికి తెరచాటు దాగున్న భగోతాలు, దుశ్చర్యలు మీడియాతోనే వెలుగులోకి వచ్చాయి. గత కొన్నేళ్లుగా దేశంలో కులం, మతం పేరుతో విద్వేషపూరిత రాజకీయాలు, దాడులు సాగుతున్న దీనిని ప్రజాపక్షం కోణంలో చూపించాల్సిన మన దేశపు మీడియా ఏ పక్షం తీసుకొందో మన ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని నేడు ఎక్కడో జరిగిన దుశ్చర్య సైతం వెలుగులోకి వస్తోంది. కానీ న్యాయం మాత్రం మంటలో కలసిపోతోంది. మనదేశంలో కార్పోరేట్ మీడియా వచ్చాక దీనికి ప్రజా పక్ష పాత్ర కంటే తమకు లాభం చేకూర్చే రాజకీయ పక్షాల మద్దతు పాత్రను పోషిస్తోంది. 2014 అనంతరం ఈ పాత్రను మీడియా మరింత సమర్థవంతంగా పోషిస్తోంది. కానీ మీడియా కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి పోయి వారు లావాదేవీ కోణంలో నడిపినా మీడియాలో పనిచేసేది మాత్రం సాధారణ జర్నలిస్టులే. వారికి ఓ మనస్సాక్షి ఉంటుంది. అంతరాత్మ ఉంటుంది. అది ఏదో ఒక రోజు బయటికి వచ్చి మీడియా దురాగతాలను బట్టబయలు చేస్తోంది. అలాంటి వాస్తవ ఘటనే మీ కోసం. 

ఇటీవల ఒక విశేషం చోటు చేసుకుంది. నిజానికి అది ఒక విప్లవాత్మకమైన పరిణామం కిందే లెక్క. మనం చేసేది జర్నలిజమే కాదనీ ఒక మీడియా సంస్థలో పని చేసే జర్నలిస్టులు తమ ఎడిటర్లకు లేఖ రాశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఉద్యోగం ఉంటే చాలులే ఏదెట్లపోతే మనకేం అనుకునే సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ పరిణామం చూసి మనం కాస్త | ఆశ్చర్య పోవడం సహజమే. టైమ్స్ నౌ అనే ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్లో సంభవించింది ఈ పరిణామం. ఈ నేషనల్ ఛానెల్ టైమ్స్ ఇండియా గ్రూపులో భాగం. రాహుల్ శివశంకర్, నావికా కుమార్, పద్మజా జోషి అనే ముగ్గురు జర్నలిస్టులు టైమ్స్ నౌ లో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ముగ్గురిని ఉద్దేశించి టైమ్స్ నౌ జర్నలిస్టులు ఈ లేఖ రాశారు. లేఖలో వారు కుండబద్దలు కొట్టారు. నందిని నంది పందిని పంది అనడానికి ఏమాత్రం. సందేహించలేదు. వారు లేఖలో ఏమి రాసింది వారి మాటల్లోనే క్లుప్తంగా..

ఎడిటర్లకు జర్నలిజం ప్రాథమిక సూత్రాలు చెప్పే రోజు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండండి. అధికారంలో ఉన్నవారిని నిలదీ యండి అని మా జర్నలిజం గురువులు మాకు చెప్పారు. టైమ్స్ లో ప్రస్తుతం జరిగేది దానికి పూర్తి వ్యతిరేకం. జర్నలిస్టులుగా మన చుట్టూ ఏం. జరుగుతోందో మనకు తెలుసు. కరోనా సోకిన జనం ఆసుపత్రుల్లో బెడ్ కోసం వీధుల్లో, అంబులెన్సుల్లో పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవార కొందర ఆక్సిజన్ అల్లాడుతున్నారు. కొందరు దొరక్క కన్నుమూస్తున్నారు. ప్రాణాధార ఔషదాలు దొరకడం లేదు. ప్రభుత్వం కన్నా మంచి మనస్సున్న మారాజులే విడ్ రోగులను ఎక్కువ ఆదుకుంటున్నట్లు కనబడుతోంది. మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. మన కళ్ల ముందు ఓ పెను విపత్తు విచ్చుకుంటున్నది. పెద్ద పేరున్న మన టైమ్స్ నౌ ఛానెల్లో జర్నలిస్టులుగా మనం ఏమి చేస్తున్నాం ఇప్పుడు మనం ఇంకా ప్రతిపక్షాలనే నిందిస్తున్నాం. అసలైన విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాం. హిందూ ముస్లిం విభేదాలు పెంచే చర్చలు నడుపుతున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రతి అంశాన్నీ మసి పూసి మారేడు కాయ చేస్తున్నాం. అసమర్థ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతి సందర్భంలోనూ మనం మౌనం వహిస్తున్నాము. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి సంబంధించి నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి కూడా మనం సిద్ధంగా లేము. కోవిడ్ నిబంధనలు పాటించకుండా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించే ప్రతిపక్ష నేతల వీడియోలు చూపిస్తాం. అదే పని చేస్తున్న అమిత్ షా ఫొటో కూడా చూపించం. అంత వెన్నెముక లేకుండా తయారయ్యాం. యుపిఎ హయాంలో పాలన పడకేసిందని మీరు పదేపదే గొంతెత్తి అరిచిన సంగతి గుర్తుందా! వ్యవస్థ మొత్తం కుప్పకూలిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వాన్ని మనం కనీసం ఒక్కసారైనా నిలదీశామా? కోవిడ్ మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం టైమ్స్ నౌ ఎడిటర్లకు ఇష్టం లేదన్న సంగతి సుస్పష్టం. దేశంలో వేలాది మంది మరణిస్తున్నప్పుడు వాస్తవ పరిస్థితిని ఎత్తిచూపడం మన కనీస ధర్మం. దానికి బదులు మనం నాన్ బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తున్నాం. బిజెపి ఐటి సెల్ అజెండాను. అమల్లేస్తున్నాం. ప్రజల బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సింది పోయి మనం రైతులపై విరుచుకుపడుతున్నాం. ప్రధానమంత్రి నిర్లక్ష్యాన్నీ, అసమర్ధతనూ ప్రశ్నించాల్సింది పోయి ఆయనను చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బిజెపి ఐటి సెల్ నుంచి వచ్చే మేసేజ్లపై ప్రైమ్ టైమ్ చర్చాగోష్టులను నిర్వహిస్తున్నాం. ఎట్లా తయారయ్యాం మనం చివరికి? ఒకప్పుడు ప్రజల పక్షాన గొంతెత్తిన ఛానెల్ ఇప్పుడు ప్రభుత్వ బాకాగా తయారైంది. ప్రజల పక్షాన ఎప్పుడు నిలుస్తారు మీరు? ఛానెల్లో జర్నలిస్టులందరితో బిజెపి కోసం పని చేయించడం ఎప్పుడు మానుకుంటారు మీరు? మీరు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలంటే ఇంకెన్ని శవాలు లేవాలి? ఇంకెంత రక్తం మీ చేతులకు అంటుకోవాలి?

మీ ముందున్న ప్రశ్న చాలా చిన్నది. ప్రజల పక్షాన నిలుచోవాలా? లేక బిజెపి పక్షాన నిలుచోవాలా? బిజెపి పక్షాన నిల్చోవడం అంటే మీరు మీ వృత్తి ధర్మానికే కాదు.. ఈ దేశానికే ద్రోహం చేస్తున్నట్లు. ఇది టైమ్స్ నౌ జర్నలిస్టులు వ్యక్తం చేసిన ఆక్రోశం. ఆగ్రహం. కొన్ని మిగతా జాతీయ ఛానెళ్లలో పని చేసే జర్నలిస్టులకు కూడా ఆ లేఖ చివరన ఒక పిలుపునిచ్చారు. 'మీరు కూడా గొంతెత్తండి. ఇప్పుడు గొంతెత్తకపోతే చరిత్ర మనల్ని క్షమించదు.' అని రాశారు. దాదాపుగా అన్ని నేషనల్ ఛానెళ్లు నిస్సిగ్గుగా మోడీ ప్రభుత్వ భజన చేస్తున్నాయని తెలుసు. ప్రజల పక్షాన గొంతెత్తడం మానేశాయి. టైమ్స్ నౌ జర్నలిస్టులు ఆ లేఖలో చెప్పినట్టు యుపిఎ హాయాంలో ఈ ఛానెళ్లన్నీ ప్రభుత్వ తాట తీశాయి. ఇప్పుడు మోడీ సర్కార్ పక్షాన నిలిచి ప్రజల తాటతీస్తున్నాయి. విషాదం ఏమంటే చాలా మంది.  ప్రజలకు ఈ విషయం అర్థం కావడం లేదు. అని ఆ మనస్సాక్షివున్న జర్నలిస్టులు ఉన్నారు. దీనిని బట్టే అర్థమైంది. మీడియా ఈ దేశంలో ఏవరి పక్షం వహిస్తుందో, బీజేపీ అమాంతంగా బలపడుతోందన్న కథనాలు దేనికోసమో ఈ ఘటనతో తేలిపోతుంది. మీడియా ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. వాస్తవం పక్షాన నిలవాలి. లేకపోతే మీడియా కంటే ప్రజలు సోషల్ మీడియాపైనే ఎక్కువగా ఆధారపడుతారు. ఏ ప్రజలు తమను నమ్ముతారని, తమపై ఆధారపడుతారని ఉన్న మీడియా తన ఉనికిని కోల్పోయే ప్రమాదముంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: