ఐపిఎల్ వాయిదా
క్రికెటర్లకు కరోనా సోకడంతో బిసిసిఐ నిర్ణయం
(జానోజాగో వెబ్ న్యూస్-స్పోర్స్ ప్రతినిధి)
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నా కూడా కరోనా బారిన క్రికెటర్లు పడడంతో ఐపిఎల్ మ్యాచ్ లను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. మంగళవారం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో తీర్మానించడం జరిగింది. డబుల్ బబుల్ వల్ల ఆటగాళ్లకు కరోనా సోకే అవకాశం లేదని స్పష్టం చేసినప్పటికీ ఆటగాళ్లకు కరోనా సోకడంతో బిసిసిఐ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ప్రాంచైజులు, బిసిసిఐ కొనసాగించాలని డిమాండ్ చేసిన ఫలితం దక్కలేదు. వరుణ్ చక్రవర్తి, సందీప్, వృద్దిమాన్ సాహా లకు కరోనా పాజిటివ్ వచ్చిందని రిపోర్టు ద్వారా తేట తెల్లమైంది. ఇప్పటికే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టోర్నీ కి దూరమయ్యాడు. అశ్విన్ తల్లి దండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో తన ఇంటికి వెళ్లి పోయాడు. అలాగే విదేశీ ఆటగాళ్లకు కూడా సోకే ప్రమాదం పొంచి ఉందని మేనేజ్మెంట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
స్పిన్నర్ అమిత్ మిశ్రా కు కూడా టెస్ట్ పాజిటివ్ వచ్చిందని రిపోర్టు వచ్చింది. దీంతో ప్రత్యేక సమావేశంలో చర్చించిన తర్వాత వాయిదా వేస్తున్నట్లు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఆటగాళ్లను సురక్షితంగా వారి వారి ఇళ్లకు చేర్చేందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశీ ఆటగాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విమానయాన సంస్థ రవాణా వ్యవస్థ ను మూసివేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలనే ఆంశాన్ని పరిస్థితుల కనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని గంగూలీ ప్రకటించారు. కరోనా కట్టడి తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి తరువాత నిర్ణయిస్తామని అన్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: