సీఎం 'స్టాలిన్' ప్రకాశం జిల్లాను సందర్శించాలి

వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి ఆకాంక్ష

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా స్టాలిన్ పూర్వీకులు తెలుగువారే అని చరిత్రకారులు చెప్పిన విషయాన్నీ  గుర్తుచేశారు.. ప్రకాశం జిల్లా పూర్వీకుడైన స్టాలిన్‌.. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంపై జిల్లావాసిగా తానెంతో సంతోషిస్తున్నానని చెప్పారు. ప్రపంచానికి ఎందరో గొప్పవాళ్ళను ప్రకాశం జిల్లా పరిచయం చేసింది.. అందులో కరుణానిధి, స్టాలిన్ కూడా ఉండటం ఎంతో  గర్వించదగ్గ విషయం అన్నారు. 

ప్రకాశం పంతులు గారిని కలుపుకుంటే కరుణానిధి, స్టాలిన్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులను ఈ జిల్లా అందించిందని ఏలూరి చెప్పారు. రాజకీయ నాయకులే కాదు  భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ, సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారేనని ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన జిల్లాను ఒక్కసారి సందర్శించి స్టాలిన్ తమ పూర్వీకుల మూలలను గుర్తుచేసుకోవాలని కోరారు ఏలూరి రామచంద్రారెడ్డి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: