ప్రభుత్వ  ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించండి

దాతల సేవలు వినియోగించుకోవాలి

హిందూపురం అఖిలపక్షం 


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా  హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  నెలకొన్న సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్ వెంకటేష్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి  నూతన సూపర్ డెంట్  డాక్టర్ జోసెఫ్ గారిని కలసి విన్నపించారు అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్పత్రిలో దాతలు ఇచ్చిన వైద్య పరికరాలు  వెంటిలేటర్స్ ఎక్సరే ఇతర వైద్య పరికరాలను సక్రమంగా వినియోగంలోకి తీసుకురావడంలో లోపం జరుగుతున్నా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దాతల  ఔదార్యం తో ఇచ్చిన వాటిని వాడుకలోకి తీసుకురాకపోతే దాతలు మరిన్ని సేవలు అందించడానికి ఎలా ముందుకొస్తారని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఉన్న సిటీస్కాన్ గత కొన్ని నెలలుగా పనిచేయడం లేదని వాటిని మూలన పడేయడం శోచనీయం ఆన్నారు పేదలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళి వేలకు వేలు రూపాయలు వెచ్చించి లేక నష్టపోతున్నారన్నారు. గతంలో కూడా ఇదే విషయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సిటీ స్కాన్ వాడకంలోకి తీసుకు వచ్చి పేద ప్రజలందరినీ ఆదుకోవాలన్నారు. 80కు పైగా దాతలు అందించిన వేoటిలేటర్లు ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు.


కరోనా నిర్ధారణ కేంద్రంలో గత వారం నుంచి పరీక్షలు నిలిచిపోయాయని వాటిని వెంటనే ప్రజల అవసరాల కొరకు తక్షణం కరోనా నియంత్రణ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. జిల్లా ఆస్పత్రులకు 108 వాహనాలు  ఒకటే ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉందని ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను అధికారులు గమనించి ఇంకా కొన్ని 108 వాహనాలు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో బాలాజీ మనోహర్, డిఇ రమేష్ కుమార్, బీఎస్పీ శ్రీరాములు, ఇ ఎస్ వెంకటేష్ ఉమర్  ఫారుఖ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: