ముస్లిం సోదరులకు,,,

వైసీపీ నేత ఏలూరి రంజాన్ శుభాకాంక్షలు

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ రోజున  దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హిందూ ముస్లిం సోదరభావ స్ఫూర్తి మరింతగా పరిఢవిల్లాలని డాక్టర్ ఏలూరి అల్లాను ప్రార్ధించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో నమాజ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ముస్లింలను కోరారు.
సాధ్యమైనంత మేరకు ఎవరి ఇళ్లల్లో వారే ప్రార్ధనలు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. మసీదుల్లో ప్రార్ధన చేసే సమయంలో సామాజిక దూరం పాటించి అల్లాను ఆరాధించాలని చెప్పారు. కాగా మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావ‌డంతో ముస్లింలు ఈ నెల‌కు అత్యంత ప్రాముఖ్య‌త‌‌ ఇస్తార‌న్నారు. నెల రోజుల‌పాటు నియ‌మ నిష్ట‌ల‌తో క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించే పుణ్య‌మాసాన్ని వదిలి రంజాన్ తో ముగిస్తారని అన్నారు. వారికి అల్లాహ్ దీవెన‌లు ఎల్లవేళలా ల‌భించాల‌ని ఏలూరి అభిలషించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: