పేదలకు అందుబాటులో వైద్యసేవాలు
మంత్రి మల్లారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-జవహర్ నగర్ ప్రతినిధి)
పేదలకు అందుబాటులో ఉండేలా వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీ నగర్‌లో దాన్ ఎస్‌వీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ సమయంలో అందరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తతో ఉండాలన్నారు. కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని...అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యేకంగా పేద కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన దాస్ ఎస్‌వీ ఆసుపత్రి పేదలకు మరింతగా వైద్యసేవలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా దాస్ ఎస్‌వీ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మురుగేష్, మేక లలితాయాదవ్, మనోధర్‌రెడ్డి, స్థానిక నాయకులు మేకల అయ్యప్ప, భార్గవ రామ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం స్థానిక 5వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛమైన నీటితో ఆరోగ్యం కాపాడుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: