అధిక ధరలను నియంత్రించండి

సిండికేట్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ భాష

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కరోనా పరిస్థితిని ఆసరాగా చేసుకుని నిత్యావసర వస్తువుల ధరలను వ్యాపారులు అమాంతంగా పెంచేస్తున్నారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా తెలియజేశారు. నిత్యవసర వస్తువులను అధిక ధరకు వినియోగిస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాపారులంతా సిండికేట్ మారి నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర వస్తువుల తో పాటు ఇతర సిగరెట్ వంటి వస్తువుల ధరలు కూడా అమాంతంగా పెంచేశారని ఆయన తెలిపారు. ధరల నియంత్రణ బాధ్యతను చేపట్టాల్సిన అధికారులు మామూళ్ల తీసుకొని చూసీచూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ అధికారులతో పాటు అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: