పండుగ సమయంలో,,,

పేద ముస్లింలకు  అండగా ఈద్ కిట్లను

పంపిణీ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్.యమ్.డి ఫారూఖ్ 


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్సీ ఎన్.యమ్.డి ఫారూఖ్, వారి తనయులు ఎన్.యమ్.డి ఫిరోజ్ లు పండుగ సమయంలో పేద ముస్లింలకు  అండగా ఈద్ కిట్లను పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా తమ నియోజకవర్గంలో పేద ముస్లిం ప్రజానీకం పండుగను సంతోషంగా జరుపుకోవాలనే  మనవతా  దృక్పధంతో ప్రతి రంజాన్ లాగే ఈసారి కూడా తమ సొంత నిధులతో దాదాపు 1500 వందల ఈద్ కిట్లను పేద ముస్లిం ప్రజలకు పట్టణంలోని వార్డుల్లో తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీ వార్డు నాయకులతో పంపిణీ చేయించడం జరిగింది. ముస్లిం మైనారిటీ వార్డుల్లో ఉన్న పేద ప్రజలకు వీటిని పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షబ్బీర్, శైలాబ్, అక్బర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.




 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: