గిరిజన ప్రాంత వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 

గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్

గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో కరోనాపై సరైన అవగాహన లేక వైద్యం అందడం లేదని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతి తాండలో గిరిజనులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ అధికారులను కోరారు. మంగళవారం జిపిఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బ్రతుకు తెరువు కోసం కూలి పనులు చేసుకుంటూ, జీవనం సాగిస్తున్న గిరిజనులకు కరోనాపై అవగాహన లేక చాలా మంది వైద్యం అందక ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లలేక చాలా మంది మధ్యలోనే కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులు ప్రతి గిరిజన తండాలలో ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ను వేయించాలని కోరారు. గిరిజనులు డయేరియా, చలి జ్వరం, విష జ్వరాలతో చికిత్స తీసుకోవడానికి ముందుకురారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక దృష్టి  సారించాలన్నారు. కరోనా కట్టడి, చికిత్సలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి తండాలలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చెయ్యడం వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. రెమ్ డేసివర్ ఇంజక్షన్లు, ఆస్పత్రిలో బెడ్ ల సంఖ్య, పెంచడంతో పాటు, వెంటిలేటర్లు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తోందని,అవగాహన లేని తాండా గిరిజన ప్రజలను ఆదుకునేందుకు సరైన సమయంలో వ్యాక్సిన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకోవాలని వారు కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: