న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించాలి

హెల్త్ కార్డులు రెన్యువల్ చేయాలి


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ నిధి ద్వారా అందుతున్న హెల్త్ కార్డుల రెన్యువల్ చేయాలని బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయ కార్యదర్శిని స్వయంగా కలిసి విన్నవించారు. అదేవిధంగా కొత్త వారికోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల రూపాయల  భీమా సౌకర్యాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరినట్లు తెలిపారు. న్యాయవాదికి చెందిన తల్లిదండ్రులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని లా సెక్రెటరీ ఎ.సంతోష్ రెడ్డి కి విన్నవించారు. అందుకు ఆయన సందిస్తూ కొత్తవారికి అవకాశం కల్పించాలంటే అదనంగా రూ.8 నుంచి రూ.10 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కరోనా బారిన పడి న్యాయవాదులు మృత్యువాత పడుతున్నారని, కరోనా చికిత్స నిమిత్తం ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని జిల్లాలకు చెందిన బార్ అసోసియేషన్లు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. గతంలో అందిన విధంగా తెలంగాణ ప్రాంతంలోని న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: