స్టోర్ డీలర్ల వద్ద గోనె సంచులు కొనుగోలు చేస్తే చర్యలు

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల రెవెన్యూ డివిజన్ లో స్టోర్ డీలర్ల వద్ద గోనె సంచులు కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి హెచ్చరించారు. గురువారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ కోవిడ్ వైరస్ విస్తరణ దృష్ట్యా పశ్చిమ బెంగాల్ రాష్ట్రము నుండి సరఫరా అవుతున్న గోనె సంచులు సరఫరా కానందున ప్రజాపంపిణీ వ్యవస్థ కింద బియ్యము, ఇతర నిత్యావసర సరుకులు సరఫరా చేయుటకు గోనె సంచుల కొరత వలన అంతరాయం  కలుగుతుందని, కావున నంద్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని చౌక ధాన్యపు దుకాణపు డీలర్ల వద్ద గల గోనె సంచులు వ్యాపారులు గాని ఇతరులు ఎవ్వరు కాని కొనకూడదని అలా కొన్నవారిపై నిత్యవసర వస్తువుల చట్టము,1955 కింద కఠిన చర్యలు తీసుకొని వారి నుండి గోనె సంచులు స్వాధీనము చేసుకొనబడునని ఆమె తెలిపారు.  చౌకదుకాణపు  డీలర్లు వారి దుకాణమునకు  సరఫరా చేయబడిన బియ్యము ఖాళీ  సంచులు  సంబందిత తహశీల్దార్, సిఎస్డిటి, స్టాకిస్ట్ కు వెంటనే అప్పగించవలసినదిగా తెలియజేశారు. ఇందులకు ప్రభుత్వము నిర్ణయించబడిన ధర చెల్లించబడుతుందని సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: