వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలతో సన్మానం

మార్కాపురం పట్టణంలో వాలంటీర్లకు ప్రశంసలు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణంలోని 16వ సచివాలయ కార్యాలయములో 28వ వార్డు మునిసిపల్ కౌన్సిలర్ షేక్. కరీమున్ ( షేక్ కరీమ్ సా, షేక్ కాశింబీ ) 28వ వార్డుకు సంబంధించిన 16వ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యములో,  వాలంటీర్ల సేవలను  గుర్తించి వారికి సేవామిత్ర పురస్కారాలతో ఘన సన్మానించారు.కేవలం 5,000/- రూపాయాలు గౌరవ వేతనం తీసుకుంటూ కృతజ్ఞతా భావంతో స్వచ్ఛందంగా సేవలందిస్తూ నిత్యం ప్రజా సేవలో ప్రజల మధ్య వుంటూ ప్రభుత్వ పథకాలు అందిస్తూ , రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రభుత్వ పథకాలు అర్హులైన వారి ఇంటి వద్దకే అందిస్తూ ప్రజల అభిమాన మన్నలను పొందుతున్న వాలంటీర్లను గుర్తించిన సచివాలయం అధికారులు తమ కార్యాలయములో 28వ వార్డు కౌన్సిలర్ సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా అడ్మిన్ సి.హెచ్.ఎల్.వి.నరసింహ మాట్లాడుతూ అర్హులైన ప్రజలందరికీ ఈ ప్రభుత్వ పాలనలోనే ప్రతి ఒక్కరినీ గుర్తించి ప్రభుత్వ పథకాలు అందించేలా కష్టపడుతూ ముందుకు సాగుతున్న  వాలంటీర్ల సేవలను కొనియాడారు. సచివాలయాల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించడము జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తేదిన అవ్వా తాతలకు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.జిల్లాలో 4.5లక్షల మంది యువత కు గ్రామ,వార్డు ల్లో వాలంటీర్లుగా నియమించడము జరిగిందన్నారు. అందులో 50శాతం మహిళలకు 50శాతం పురుషులకు కేటాయించడము జరిగిందన్నారు.


గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ప్రభుత్వం నియమించడ ము జరిగిందన్నారు.కోవిడ్ సమయంలో వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించారన్నారు వాలంటీర్లు పనితీరును ప్రభుత్వం గుర్తించి వారిని ప్రోత్సాహించడానికి నగదు పారితోషికాలతో పాటు సేవామిత్ర పురస్కారాన్ని అందించడం  జరుగుతుందన్నారు. భవిష్యత్ లో వాలంటీర్లు కు ప్రోత్సాహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. పూర్తిగా వాలంటీర్లు సేవాదృక్పధంతో కష్టపడుతూ వారు అందించే  సహకారంతోనే ఈ సచివాలయాలకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ వాలంటీర్ల వ్వవస్ధను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా వాలంటీర్ షేక్ బాజి గురించి, వారు చేసిన సేవలను కొనియాడుతూ తను కులమతాలకు అతీతంగా చేస్తున్న సేవలను, కరోనా సమయంలో మానవత్వంతో తన పరిధిలో అవసరార్ధులకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు అందిస్తూ ప్రజల మధ్య గుర్తింపు పొందిన షేక్. బాజి భవిషత్ లో ఇంకా సేవ దృక్పథంతో ముందుకు పోవాలని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


 

 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: