షబ్బీర్ అహమ్మద్ స్పూర్తిని కొనసాగించాలి
సంస్మరణ సభలో ప్రముఖల నివాళి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ రాష్ట్ర కన్వీనర్ షెబ్బీర్ అహ్మద్ సంస్మరణ సభ" స్థానిక కమ్యూనిస్టు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర సలాహ మండలి సభ్యులు అష్రఫ్ అలీ మాట్లాడుతూ..ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక ఉద్యమం ముందు ఉండి నడిపి ప్రజల్లో నల్ల చట్టాల పై అవగాహన కల్పించిన షబ్బీర్ ఈ రోజు మన మధ్య నుండి వెళ్లిపోవడం బాధాకరం. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఆయన గురువారం తెల్లవారుజామున మృతి చెందారు అన్న విషయం ఆయన అభిమానులు రాజ్యాంగ ప్రేమికులకు తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆయన ఎస్ఐఓ లో చురుకుగా పనిజేసీ ఎందరో ధర్మ యోధులను ఇస్లామీయ ఉద్యమానికి అందించారు. గతంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కి రాష్ట్ర భాద్యులగా పనిజేసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఇచ్చిన స్పూర్తితో రాజ్యాంగ విలువల కాపాడాలి అని అన్నారు.
ఏంపీజే రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ నల్ల చట్టాల పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో షబ్బీర్ అహ్మద్ పాత్ర ఎనలేనిదని, ప్రజా ఉద్యమంలో ఒక అజాత శత్రువు, నిగర్వి, ప్రజా సమస్యలపై నిరంతరం పొరాడిన యోధుడు అని అన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కమ్యూనిస్టు నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ షబ్బీర్ అహ్మద్ లాంటి మేధావి మళ్ళీ పుట్టరు ఆయన్ని కోల్పోవడం బాధాకరం అన్నారు. బీసీ రాష్ట్ర నాయకులు పీఎల్పీ యాదవ్ మాట్లాడుతూ అలయన్స్ అగైనెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్సార్సీ, సీఏఏ కన్వీనర్ గా పనిచేసి తెలుగు రాష్ర్టాల ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన కలిపించిన గొప్ప వ్యక్తి షబ్బీర్ అహ్మద్ అని ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు సోమయ్య, ఎస్ఎండీ రఫీ, షేక్ ఖాసీం, మజ్లీసూల్ ఉలేమా అధ్యక్ష కార్యదర్సులు మౌలానా సాదిక్ మౌలానా అబ్దుర్ రహిమ్, ఎంపీజే రాష్ట్ర ఫౌండర్ మెంబర్ షేక్. రసూల్, పట్టణ కన్వీనర్ షేక్ గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: