నేడు సాగర్ ఎన్నిక లెక్కింపు

కరోనా నిబంధనల ప్రకారం ఏర్పాట్లు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారంనాడు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ఫలితాలు కూడా వెలువడ్డనున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా ప్రభావం దృష్ట్యా అన్నీ చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. గెలుపు పట్ల ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అందించిన వివరాల ప్రకారం అధికార పార్టీ అభ్యర్థికి కొంత శాతం ఎక్కువ ఉన్నట్లు వెల్లడించాయి. తెరాస పార్టీ అభ్యర్థిగా గెలిచిన నోముల నర్సింహం ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. తనయుడు నోముల భగత్ తెరాస పార్టీ అభ్యర్థిగా బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి, బిజెపితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఫలితం కోసం ఉత్కంఠత నెలకొంది.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: