కోవిడ్ మహమ్మారి ని తరిమి కొడదాం

చైతన్య కార్యక్రమంలో ముస్లిం నగారా అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మిత్రబృందం షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన కోవిడ్ మహమ్మరిని తరిమి కొడదాం అనే చైతన్య కార్యక్రమంహిందూపురం పట్టణంలోని  ఇస్లాం పురం లో జరిగింది. ఉమర్ ఫారూఖ్ ఖాన్ కోవిడ్ చైతన్య కార్యక్రమంలో ప్రసంగిస్తూ మొహమ్మద్ ప్రవక్త  సందేశం మహమ్మారి సోకిన వ్యక్తి ఇతరులకు మహమ్మారి సోకకుండా జాగ్రత్త వహిస్తూ  చికిత్స తో పాటు మహమ్మారి తో ఇతరులకు ఇబ్బంది కాకుండా మసలు కోవాలని సందేశం వినిపించారు భౌతిక దూరం పాటిస్తూ దగ్గు తుమ్ము నుంచి బ్యాక్తీరియా ఇతరులకు చేరకుండా మాస్క్ లు ప్రతి ఒక్కరూ వాడాలని చౌక ధాన్యపు దుకాణాలదగ్గర .క్యూ పద్దతిలో భౌతిక దూరం పాటిస్తూ సబ్బు తో చేతులు కడుగుకోవడం లాంటి నియమాలను పాటిస్తూ ఒకరినుండి


 

ఇంకొకరు మహమ్మారి బారిన పడకుండా ప్రభుత్వ విధి విధానాలను వైద్యుల సలహాలను పాంటించి కోవిడ్ ను కూకటి వేళ్ళతో పెకళించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మాస్కులు. శానిటయిజర్.నిత్యావసర వస్తువులు దాదాపు 40మందికి అందజేశారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ రక్తదానసంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్.టిప్పూ బ్రిగేడ్ అధ్యక్షులు అతీఖుర్రహమాన్.జియా. ఇస్లాం పురము మజీదు ముతవల్లీ అబ్దుస్సుబహాన్.హెచ్ ఫైరోజ్బాషా.తదితరులు పాల్గొన్నారు.


 

 





,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: