నంద్యాలలో అధునాతన గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ప్రారంభించిన ఎంపి పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి
ఆస్పత్రిని ప్రారంభిస్తున్న ఎంపి, ఎమ్మెల్యేలు, మునిసిపల్ చైర్మన్ మాబునిసా, ఆస్పత్రి ఎండి డాక్టర్ గెలివి సిద్ధార్థ, గెలివి సహదేవుడు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాలలో గురువారం అధునాతన గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ప్రారంభించారు. పట్టణంలోని పద్మావతినగర్ రోడ్ స్టేడియం ఎదురుగా నూతనంగా, ఆధునిక హంగులతో ఈ గ్యాస్ట్రో, కాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. హైదరాబాద్ లోని కామినేని, అపోలో హాస్పిటల్స్, క్యాన్సర్ శస్త్ర చికిత్సలో నైపుణ్యం పొందిన డా. గెలిపి సిద్ధార్థ ఆధ్వర్యంలో అధునాతన గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపి, ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 7 సంవత్సరాలుగా నంద్యాలలో గెలివి నర్సింగ్ హోమ్, ఇతర హాస్పిటల్స్ ద్వారా తమ శస్త్ర చికిత్సా వైద్యంతో ఎందరో రోగులకు స్వస్థత చేకూర్చిన సిద్దార్థ నేడు ఆస్పతిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం వల్ల కాన్సర్ లాంటి వైద్యం నంద్యాలలోనే అందుతుందని,
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నంద్యాలలో 1980 నుండి దాదాపు నాలుగు దశాబ్దాలుగా గెలి నర్సింగ్ హోమ్, బైర్మల్ స్ట్రీట్ వద్ద అందిస్తున్న డా. సిద్ధార్థ హాస్పిటల్ డా. గెలివి సహదేవుని కుమారుడు స్పెషాలిటీ సేవలు అందిస్తారని పేర్కొన్నారు. మునిసిపల్ చైర్మన్ షేక్ మాబునిసా మాట్లాడుతూ నంద్యాల, పరిసర గ్రామాల ప్రజలు గెలివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సేవలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ షేక్ మాబుని, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మార్కెట్ యార్డు చైర్మన్ ఇషాక్ బాష, వైకాపా నాయకులు రాజగోపాల్ రెడ్డి, పుర ప్రముఖులు, డా. గెలిపి సహదేవుడు, గెలివి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: