ఆ అధికారి పరిధిమించి మాట్లాడుతున్నారు

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

డైరెక్టర్ అఫ్ హెల్త్ శ్రీనివాస్ తన పరిధిని మించి మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. ఇటువంటి విషయాల్లో స్పందించాల్సింది, సి.ఎం, కె.సి ఆర్ లేదా క్యాబినెట్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ మంత్రి కె.టి.ఆర్. అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ....ప్రక్క రాష్ట్రాల సి.ఎస్ లకు మన రాష్ట్ర సి.ఎస్ ఉత్తరాలు రాసి చేతులు ముడుచు కోవటము కన్నా ఈ విపత్కర సమయములో మన ముఖ్యమంత్రి స్వయముగా అందరితో మాట్లాడి భాధల్లొ ఉన్నతెలుగు ప్రజలను ఆదుకునే చొరవ తీసుకోవాలి. రాష్ట్రము విడిపోయినందుకు ఈ భాధలు పడాల్సి వస్తుందనే భావన ఆంధ్ర ప్రజల్లో కలుగ వద్దు. తెలంగాణ ప్రజలు సంకుచిత స్వభావులు అనే మచ్చ రావద్దు. డి.హెచ్ మీడియాలో మాట్లాడిన మాటలు ఇదే భావాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంత ప్రజల సంబదీకులు ఈ రాష్ట్రములో స్థిర నివాసము కల్గి ఉన్నారనే విషయాన్ని మరువకూడదు. ఒక వైపు అక్కడ మంచి ఆసుపత్రులు తక్కువ, మెరుగైన వైద్య సౌకర్యాలు లేవు అంటూ మరొక వైపు తిరకాసు పెట్టడము తప్పుడు సంకేతలిస్తుంది. డి.హెచ్ మాటలు పుండు మీద కారము చెల్లినట్టు ఉంది  ఒక వైపు హైకోర్ట్ ఆదేశాలకు విరుద్దముగా ఆంధ్ర సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపుతూ, మరొక వైపు ఆపటము లేదని ప్రెస్ మీట్ లో చెప్పటము సరికాదు. ఆయన మీడియా సమావేశములో మాట్లాడిన మాటల తీరు , అంబులెన్సులు ఆపటము జరుగుతుందనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అంబులెన్సులు ఆపకపోతే ఆపవద్దని కోరుతూ హైకోర్ట్ లో మళ్లీ పిటిషన్ ఎందుకు వేయడము జరిగినది? వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కష్ట నష్టాలను భరిస్తూ మెరుగైన వైద్యము లభిస్తుందనే ఆశతో వస్తున్నారు. వారిక్కడ వచ్చి ప్రాణాలు కోల్పోతే, రాష్ట్రములో మరణాల సంఖ్య పెరుగి చెడ్డ పేరు వస్తుందనే సంకుచితత్వము సరికాదు. మనకున్న ఆక్షిజన్ మరియు మందుల పై భారము పడుతుందన్న హైరానా కూడా సరికాదు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించి ఎక్కువ కేటాయింపులకు ప్రయత్నించాలి. ఈ విపత్కర సమయములో సాటి మానవులను ఆదు కొవాలని ఒక వైపు నీతులు చెప్తూ మరొక వైపు ప్రభుత్వాలే సంకుచిత బుద్దితో వ్యవహరించడము సరికాదు. అని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: