జర్నలిస్టులను ప్రభుత్వాలు ఆదుకోవాలి

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి విజ్ఞప్తి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కరోనాను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సమాచారం ఇవ్వాలన్న తాపత్రయంతో కొంతమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రింగర్ల దగ్గర్నుంచి ఎడిటర్ స్థానంలో ఉన్న వారు వరకూ.. కరోనాకు బలి అయిపోతున్నారని.. అందువల్ల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  కోరారు.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులను ఆయా ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వార్త కన్నా ప్రాణం కూడా ముఖ్యమన్న ఏలూరి..
నిత్యం ప్రజల్లో ఉండే జర్నలిస్టులు మాస్కులు ధరించి చేతులు శానిటైజ్ చేసుకోవాలని కోరారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లకుండా దూరం నుంచే వార్తలను కవర్ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్లే జర్నలిస్టులు.. రాగానే తమ పరికరాలు శానిటైజ్ చేసి.. అనంతరం చేతులు శుభ్రాంగా కడుక్కొని.. ఆ తరువాత తమ దుస్తులు వదిలేసి ఎవరిని తాకకుండా స్నానం చెయ్యాలని సూచించారు. ఇలా చేయడం వలన ఇతర కుటుంబసభ్యులకు కరోనా సోకె ప్రమాదం తగ్గుతుందని చెప్పారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: