మమతా బెనర్జీ తగిన మూల్యం చెల్లించుకుంటారు

బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యం పెరిగిపోయిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా విమర్శించారు. బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తృణముల్ కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా బీజేపీ అధినాయకత్వం దేశవ్యాప్త నిరసనలు ఇచ్చిన పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలోని తన నివాసంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గుండాల అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఎన్నికల్లో గెలిచామన్న ధీమాతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీపై నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికైనా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇందులో కలుగజేసుకుని దాడులు నియంత్రించాలి అన్నారు. లేకపోతే ప్రజాకోర్టులో మమతాబెనర్జీ తగిన మూల్యం చెల్లించుకుంటారు అని హెచ్చరించారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: