దక్షణాదిలో...

వికసించని కమలం...?

ఏపీలో చితికిలా...తెలంగాణలోనూ అదే పరిస్థితి

దక్షణాదిలో కాలు మోపడం సాధ్యమా...?

కమలం నేతల ఆశలపై నీళ్లు...?

వలస నేతలపైనే ఇక ఆశ...?

కేరళలో ఖాతా తెరవని వైనం

తమిళనాడులో ఆశించిన ఫలితం ఎక్కడా...?

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

దక్షణాది బీజేపీకి సవాల్ గా మారింది. ఉత్తర భారతదేశంలో తన హవా ప్రదర్శించిన బీజేపీ దక్షణాదిలోనూ పాగా వేయాలని గత కొన్నేళ్లుగా వ్యూహ రచన చేస్తోంది. కానీ ఎన్ని పాట్లుపడ్డా దక్షణాది బీజేపీకి పెద్దగా కలసిరావడంలేదు. ఒక్క కర్ణాటక రాష్ట్రం బీజేపీ చేతిలో ఉన్న ఇతర రాష్ట్రాలైన కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మాత్రం ఆ పార్టీ పాచిక పారడంలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎపుడెపుడు ఎదుగుదామా అని ఎదురుచూస్తున్న బీజేపీకి తాజాగా వెల్లడైన ఫలితాలు నిరాశే మిగిల్చాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఏపీలో జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ బొర్లపడింది. ఆ రెండు చోట మూడు స్థానానికి బీజేపీ పరిమితం కాగా ఇక దేశంలో జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే తన హవాను బీజేపీ ప్రదర్శించింది. ఇక కేరళలో అయితే గతంలో గెలిచిన ఒక ఎమ్మెల్యే సీటు సైతం కోల్పోయి ఆ రాష్ట్రంలో ఉనికి కోల్పోయింది.

ఇదిలావుంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో 2వ స్థానంలో టీడీపీ నిలవగా తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లో రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. దేశంలో మోడీ హవా తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 లో దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో 375 స్థానాలకు సంపాదించిన బిజెపి తర్వాత వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఎలక్షన్లలో తమ హవా కొనసాగించినా,  ఇప్పుడిప్పుడే ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు తాజా ఫలితాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో సంపూర్ణ మెజార్జీతో గెలవగా, మిగతా చోట్ల కూడా బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో మోడీపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: