కరోనా బాధితులుకు మెరుగైన వైద్యం సౌకర్యాలు కల్పించాలి

క్వారంటైన్లను పెంచాలి,,,కరోనా పరీక్షలు వేగవంతం చేయాలి

తహసిల్దార్, ఆసుపత్రి సూపర్డెంట్లకు అఖిలపక్షం విన్నపం


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

కరోనా బాధితుల సహయార్థం ఏర్పడిన అఖిలపక్షం శుక్రవారంనాడు అఖిలపక్షం కార్యాలయంలో డి.ఇ.రమేష్ కుమార్ అధ్యక్షత  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కరోనా బాధితులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చాలిచాలని వసతులు వైద్యులు వైద్యలు, సిబ్బంది  క్వారంటైన్ లో రోగులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నా  వీడియోలు చూస్తుంటే సమస్యలు ఎలా ఉన్నాయో తెలుస్తుందని  ప్రభుతం ప్రభుత్వ అధికారులు అప్రపత్తమమై సమస్యలు పరిష్కరించాలన్నారు రేపు 08/05/21న  క్వారయింటైన్ల సందర్శించి ప్రభుత్వం అధికారులు దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలని నిర్ణయించారు అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద  కరోనా బాధితులను ఆదుకోవాలని నిరసన చేశారు ఇంచార్జ్ తహసీల్దార్ బలరాం కు సమస్యలు తెలియజేసారు


ఇప్పుడున్న క్వారెంటైన్లు కరోనా రోగులకు సరిపడం లేదని క్వారంటైన్లలలో  రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఇంకా మెరుగైన సేవలు అందించాల్సి ఉందని  వైద్యులు వసతలు తో కూడిన క్వారంటైన్లను పెంచాలన్నారు కోవైడ్ పరీక్ష కేంద్రాలు పెంచాలని రోగులకు సరిపడ పరిక్షా కిట్లను ప్రభుత్వం నుండీ తెప్పించి పరీక్షలు వేగవంతం చేయాలని అలాగే రిపోర్టులు 24 గంటల లోపే అందించాలన్నారు  అనంతరం సమస్యలుతో కూడుకున్న వినతిపత్రాన్ని అందచేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో సూపర్డెంట్ దివాకర్  వైద్యులు ఆనంద్ బాబులను కలిసి సమస్యలు తెలియచేసారు కోవైడ్ పరీక్షలు విషయంలో  ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని

ఎప్పుడు చేస్తారో చేయరో తెలియని పరిస్థితి ఉందని రోజంతా గంటల తరబడి  క్యూలైలో కాసుకుని కుర్చున్న చివరికి కిట్లు అయిపోయాయి అనగానే వెనుతిరుగుతున్నారని మరుసటి రోజు వస్తే రోజు కిట్లు లేవని పరీక్షలు చేయడం లేదని ఇలా రోగం సోకిన వారు నిర్దారణ పరీక్ష ఆలస్యం రిపోర్టులు ఆలస్యంగా వస్తే వ్యాధి వ్యాప్తి చెందుతుందని  కోవైడ్ పరీక్షలు వేగవంతంగా చేయాలి రిపోర్టులు 24  గంటలకి అందించాలన్నారు వారు తాము అందుబాటులో ఉండే కిట్లతో  పరీక్షలు చేస్తున్నామని సమస్యను ప్రభుత్వం అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బాలాజీ మనోహర్. డి.ఇ.రమేష్ కుమార్, బీఎస్పీ శ్రీనివాసులు, ఉమర్ ఫారూఖ్, ఆర్సీపీ శ్రీనివాసులు, సీఐటీయూ వెంకటేష్, మాజీ సర్పంచ్ హెచ్.ఎన్. రాము, ఐఎన్సీ అమానుల్లా,  సమీవుల్లా, దుర్గానవీన్, నాగేంద్ర   రఫీక్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: