ఇంటింటీకి ఫీవర్ సర్వే

ఎంపీడీవో ఎస్.నరసింహులు


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

     కరోనా సెకండ్ వేవ్ ప్రజలపవిరుచుకు పడుతున్న నేపథ్యంలో వాలంటీర్లు, ఆశ  కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి వివరాలను అందజేయాలని ఎంపీడీవో ఎస్. నరసింహులు తెలిపారు. కలెక్టర్ తో జరిగిన వీక్షణ  సమావేశంలో  కోవిడ్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందని ఇందులో ఎంపీడీవో, తహసిల్దార్ ఇలా రెండు టీంలు ఉంటాయని తెలిపారు. ఈ టీమ్ లు సర్వే, టెస్టులు సక్రమంగానిర్వహిస్తున్న లేదా అనే విషయాన్ని గ్రామ గ్రామానికి వెళ్లి టీమ్ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. ఈ కోవిడ్  వార్ రూమ్ జూన్ 30 వ తేదీ వరకు పనిచేస్తుంది ఈ సందర్భంగా ఎంపీడీవో తెలిపారు. సర్వే ప్రతిరోజు  నిర్వహిస్తే   కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని, అప్పుడు కేసులు తగ్గుముఖం పడతాయని ఎంపీడీవో తెలిపారు. వాలంటీర్ల్లు ఇంతకుముందులా ఇంటి వద్ద కూర్చొని సర్వే నిర్వహించడం కుదరదని, ఆశా కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి  వాలెంటర్ యాప్ లో సర్వే నిర్వహించాలని సూచించారు. ఒక ఆశ కార్యకర్త పరిధిలో ఐదుగురు వాలెంటర్ల్లు ఉంటారని, అంతకుమించి ఉన్నట్లయితే అదనంగా ఒక అంగన్వాడీ టీచర్ ను వేయించుకోవాలని ఆయన తెలిపారు. హోం క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి వివరాలను ఆశ కార్యకర్త అప్లోడ్ చేసి ఆ వివరాలను ఒక కాఫీ తన వద్ద ఉంచుకోవాలని అన్నారు. హోం ఐసోలేషన్, హోమ్ క్వారటైన్ లో ఉన్నవారికి ఏవైనా సీరియస్ లక్షణాలు ఉంటే ఏఎన్ఎం బాధ్యత తీసుకోవాలని  రాపిడ్  టెస్టులు నిర్వహించాలని సూచించారు.  ఇందుకుగాను ఏ ఎన్ ఎం కు రాపిడ్  కిడ్స్ ను అందజేయడం జరుగుతుందని, టెస్టులు నిర్వహించవలసి ఉంటే మధ్యాహ్నం లోపు వాటిని పూర్తి చేయాలని పూర్తి చేసిన కిడ్స్ ను త్వరితగతిన ల్యాబ్ పంపించాలని తెలిపారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: