ఇదేనా న్యాయస్థానానికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

న్యాయస్థానాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవంలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. కోర్టు వ్యాఖ్యాలను ఈ ప్రభఉత్వం భేఖాతర్ చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కోవిడ్ వేళ ముగ్గురు జిల్లా కలెక్టర్లను దేవర యంజాల్ భూముల విచారణకు ఉపయోగించడాన్ని తప్పు పట్టిన హైకోర్ట్ తప్పుపట్టిందని, హైకోర్ట్ అభిప్రాయాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం తిరిగి దేవర యంజాల్ భూముల పై విచారణకు వెళ్లిన పంచాయత్ రాజ్ శాఖ కమీషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్లు శ్వేతా మహంతి, భారతి హోళీకేరీ పంపింది, ఇది గౌరవ హైకోర్ట్ అభిప్రాయాలకు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చే గౌరవానికి నిదర్శనం, గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి.
కోవిడ్ విజృంబిస్తున్న వేళ తమ జిల్లాలో ఉండి కట్టడి చేయాల్సిన ముగ్గురు జిల్లా కలెక్టర్లను దేవర యంజాల్ భూముల విచారణ కమిటీ లో వేసి విచారణ చేయించడం పట్ల ఈ నెల 8 న హైకౌర్ట్ ఆశ్చర్యాన్ని ,విస్మయాన్ని వ్యక్టము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. అయినా హైకౌర్ట్ అభిప్రాయాన్ని లెక్క చేయకుండా పంచాయత్ రాజ్ శాఖ కమీషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్లు శ్వేతా మహంతి, భారతి హోళీకేరీ దేవర యంజాల భూముల విచారణకు మళ్లీ పంపించడం దురదృష్టకరం. అని ఆయన విమర్శించారు. గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్  ప్రభుత్వ ధోరణిని గమనించి కట్టడి చేయలని ఆయన కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: