ఆ వైరస్ పై ఎలాంటి నిర్ధారణ జరగలేదు

మంత్రి పేర్ని నాని


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కరోనా వైరస్‌ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు శక్తికి మించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందని ప్రశంసించారు. చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కొత్త వైరస్‌ ఉందని అబాండాలు వేస్తున్నారని, ఎన్‌440కే వైరస్‌పై ఎలాంటి నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు. దేశంలో B.1.617 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, బెడ్స్‌, రెమిడివిసిర్‌ అన్నీ అందుబాటులో ఉంచామని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: