ముస్లిం నగారా ఆధ్వర్యంలో
నిర్విరామ అన్నదానకార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో అన్నదానం ఎనిమిదవ రోజు కోవిడ్ బాధితుల అటెండర్లకు అన్నదానం పంపిణీ జరిగింది. హిందూపురం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం మరియు రోడ్డు ప్రక్కన హోటళ్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఆడిటర్ సదానంద కుటుంబీకుల ఆర్థిక సహకారంతో 100మంది ఆన్నార్తులకు అన్నదానం చేశారు.
అనునిత్యం కోవిడ్ బాధితుల పట్ల సేవలు చేస్తున్న ముస్లిం నగారా.టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్. టిప్పు బ్రిగేడ్.టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం సభ్యులకు ఆడిటర్ సదానంద కుటుంబీకులకు పుర ప్రముఖులు ప్రశంసించారు.ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమము జరిగింది జరిగిందిఆయనమాట్లాడుతూ కోవిడ్ బాధితులు భయాందోళనలకు గురి కాకుండా మూఢ విశ్వసాలను వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లలో చికిత్స చేయుంచుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతూ చేతులను సబ్బు తో లేక శానిటయిజర్ తో శుభ్ర పరుచుకొంటు కోవిడ్ బాధితులకు వివక్ష చూపకుండా మనో ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ మహమ్మరిని పారద్రోలాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిప్పు బ్రిగేడ్ సభ్యులు ఇనాయతుల్లా.ఇర్ఫాన్.సు ల్తాన్ రియజుల్లా ఖాన్.తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలోపాల్గొన్నారు.
Post A Comment:
0 comments: