అది సహేతుకం కాదు
బొజ్జా దశరథరమిరెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం భూములలో వైద్య కళాశాల ఏర్పాటుపై ఏదేని సలహాలు, అభ్యంతరాలుంటే తెలపాలని "ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపడటానికి పారదర్శకంగా పనిచేయడానికి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ వారు ప్రజలను కోరారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములలో వైద్య కళాశాల ఏర్పాటుకు అభ్యంతరాలు తెలుపుతూ రైతు సంఘాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజలు 97 ఉత్తరాలను జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్ కు పంపారు. ఈ అభ్యంతరాలన్ని తెలిపిన వ్యక్తుల వ్యక్తిగత ప్రయోజనాల లేదా పరిమిత ప్రజా ప్రయోజనాలని, వైద్య కళాశాల ఏర్పాటు విస్తృత ప్రజా ప్రయోజనాలు కలదని భావిస్తూ జ్యుడీషియల్ ప్రివ్యూ వైద్య కళాశాల ఏర్పాటుకు టెండర్లను పిలవడానికి మే 7, 2021 అనుమతులను ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ కు మే 17, 2021 సవివరమైన ఉత్తరాన్ని రాసింది. ఈ ఉత్తరంలోని కొన్ని ముఖ్య విషయాలను కింద పొందపర్చడమైనది. ప్రాంతీయ పరిశోధనా స్థానం భూములలో వైద్య కళాశాల ఏర్పాటు చేయవద్దని రాసిన 97 ఉత్తరాలను పారదర్శకంగా వెబ్ సైట్ లో పొందుపరచడంలో, పారదర్శకంగా పనిచేయాల్సిన ఆంధ్ర ప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ విపలమైందని పేర్కొనడమైనది.
ప్రజా ప్రయోజనాల అవసరాల పట్ల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణకు సవివరమైన ఉత్తరాలను రాసిన, అసంపూర్ణ సంక్షిప్త సమాచారంను వెబ్సైట్ లో పొందపరుస్తూ, అభ్యంతరాలన్ని వ్యక్తి గత ప్రయోజనాలు లేదా పరిమిత ప్రజా ప్రయోజనాలని జ్యుడీషియల్ ప్రివ్యూ భావించడం పట్ల నిరసన వ్యక్తపరచడమైనది. 1906వ సంవత్సరంలో ఏర్పడి, రైతు శ్రేయస్సు, దేశ ఆహార భద్రతకు 115 సంవత్సరాలుగా సేవ చేస్తున్న నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం ను పరిరక్షించాలన్న ఉద్దేశంతో తెలిపిన అభ్యంతరాలు వ్యక్తిగతమైనవి లేదా పరిమిత ప్రజా ప్రయోజనాలు కలవని జ్యుడీషియల్ ప్రివ్యూ భావించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమైనది. వైద్య కళాశాల బదలాయింపు చేసే భూమికి రెండింతల భూమి వ్యవసాయ పరిశోధనల స్థానంకు కేటాయించడం వలన వ్యవసాయ పరిశోధనలకు ఎలాంటి నష్టం జరిగదనే జ్యుడీషియల్ ప్రివ్యూ భావన సరైనది కాదని సవివరమైన విషయాలను ఉత్తరంలో పొందుపరచడమైనది. నంద్యాల ప్రాంతయ వ్యవసాయ పరిశోధనా స్థానం కోల్పోయిన వ్యవసాయ పరిశోధనా మౌళిక వసతులను ఇంకొక ప్రాంతంలో అభివృద్ధి చేయడం అత్యంత ఖర్చుతో కూడినదే కాకుండా, పరిశోధనలలో అంతరాయం వలన జరిగే నష్టం, కొత్త మౌళిక వసతుల ఏర్పాటు కూడా చాలా సంవత్సరాలతో కూడిన వ్యవహారం కావడం వలన పరిశోధనలకు జరిగే జాప్యం తదితర అంశాల వలన వ్యవసాయం రంగానికి తీవ్ర నష్టాలు జరుగుతాయన్న విషయంను ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ గుర్తించలేదని అభ్యంతరం తెలపడమైనది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపడటానికి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ అభివృద్ధి చెందిన వ్యవసాయ పరిశోధనా స్థానంను నిర్వీర్యం చేస్తూ, కొత్త ప్రదేశంలో వ్యవసాయ పరిశోధనా స్థానం ఏర్పాటు కు వందలాది కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించడమైనది. వైద్య కళాశాల ఏర్పాటు వలన విస్తృత ప్రయోజనాలున్నాయని భావించే ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు ఇంకా విస్తృతమైన ప్రయోజనాలు కలవని గుర్తించడంలో విపులమైందని పేర్కొనడమైనది. కోవిడ్ - 19 నేపథ్యంలో విధిస్తున్న లాక్ డౌన్ సందర్భంలో కూడా వ్యవసాయ రంగం పనులను నిరాఘాటంగా కొనసాగించడం వ్యవసాయ రంగం ప్రాధాన్యతను తెలుయచేస్తుందని వివరించడమైనది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, చీడలు, పీడలు, ఆహారపంటలను విస్తృతస్థాయి లో నష్ట పరిచే మిడుతలదండు లాంటి ఊహించని విపత్కర పరిస్థితులకు వ్యవసాయ పరిశోధన కేంద్రాలు సిద్దంగా లేకపోతే ఈ రోజు కరోనా బారిన పడి ఆక్సిజన్ అందక చనిపోతున్నట్లే, రేపు ఆకలి చావులు సంభవిస్థాయి. ఇలాంటి ప్రధాన్యత కలిగిన వ్యవసాయ పరిశోధనలను నిర్వహిస్తున్న వ్యవసాయ పరిశోధనా కేంద్రాల అవసరాన్ని గుర్తించడంలో జ్యుడీషియల్ ప్రివ్యూ విపులమైందని తెలపడమైనది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు బదాలాయింపుపై గౌరవ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ వైద్య కళాశాల టెండర్ ప్రక్రియ కొనసాగింపును చేపట్టడం పట్ల నిరసన తెలపడమైనది. ఈ ఆంశాలన్నింటిని పరిగణనలోనికి తీసుకొని వైద్య కళాశాల ఏర్పాటుకు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమలు కేటాయించవద్దని, నంద్యాల ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల బదలాయింపు పై హైకోర్టు విధించిన స్టే ను గౌరవించి టెండర్ ప్రక్రియను ఆపాలని కోరడమైనది
Post A Comment:
0 comments: