రహదారులు త్వరగా పూర్తి చేయాలి

సీపీఐ డిమాండ్


పరిశీలిస్తున్న సీపీఐ నాయకులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్లోని జండా మాన్ ఎదురుగా శివాలయం వెనుక భాగాన రహదారులను  కాంట్రాక్టర్లు త్వరగా పూర్తి చేయాలని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం  సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కరీమ్ ఖాన్, అజీస్ భాషా, కాలనీవాసులు షబ్బీర్ భాష,  మురళి కృష్ణ, నాగరాజు, చాంద్ బాషా, ఎస్ కే భాషలు రోడ్లను పరిశీలించారు. అనంతరం సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ


ప్రజలు రోడ్లు లేక చిన్నపాటి వర్షానికి నీరు నిల్వ ఉండి పాములు, తేళ్లు దోమలతో అనేక ఇబ్బందులు పడుతూ అంటురోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరముల నుండి పోరాటాల ఫలితంగా గత సంవత్సరం 70 లక్షలకు టెండర్ పాడి రమేష్ నాయుడు అనే కాంట్రాక్టర్ పనులు దక్కించుకోవడం జరిగిందని, కానీ  సంవత్సరం కావస్తున్నా ఏమాత్రం పనులు చేయలేదని, డ్రైనేజీలు, రోడ్లు పూర్తికాలేదని, వర్షాలు మొదలయితే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి రహదారి పనులు పూర్తిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: