పదెనిమిదేళ్లు నిండిన వాలందరికీ టీకాలు ఇవ్వాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ఇవ్వాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. కరోనా రోజుకు రోజుకు ఉదృతం అవుతోందని దీనిని నియంత్రించాలంటే టీకా వేయడం ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా అందించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. విపత్తు నివారణ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 8,873 కోట్లు విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నిధులతో వ్యాక్సినేషన్ తోపాటు ఆక్సిజన్ అందించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: