నాంపల్లి కోర్టులో శానిటైజేషన్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా జాగ్రత్తల దృష్ట్యా శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో శానిటైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ తరఫున పరిశుభ్రత, పరిరక్షణ చర్యలు చేపట్టింది. కరోనా బారిన పడి న్యాయవాదులు సైతం మృత్యువాత పడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్నీ కోర్టులు ఆన్లైన్ ద్వారానే కేసుల విచారణ కొనసాగుతున్న విషయం విదితమే.

ప్రభుత్వం తరఫున వాక్సినేషన్ కార్యక్రమం సైతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు లోపలికి న్యాయవాదులకు ప్రవేశం లేదు. ఆన్ లైన్ ద్వారానే అన్ని కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రాబోవు రోజుల్లో మూడో వేవ్ కరోనా ప్రభావం తీవ్రతరం ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య శాఖ అధ్వర్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: