ఆల్ మేవ ఆధ్వర్యంలో రమజాన్ కిట్లు పంపిణి

కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

మంచి కార్యక్రమంగా ప్రశంసా


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి) 

నంద్యాల డివిజన్ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమజాను కిట్లు పంపిణీ చేసారు. ఇమ్రాన్ పాషా అధ్యక్షతన శాంనగర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, గౌ. అధ్యక్షులు అబ్దుల్ సమద్ పాల్గొని రమజాన్ కిట్లు పేద కుటుంబాలకు పంపిణీ చేసారు. ఈ సంధర్భంగా సమద్ కార్యక్రమ విషయాలు వివరిస్తూ ఆల్ మేవ సభ్యులు తమ జకాత్ నుండి సేకరించిన లక్ష ఇరవై వేల రూపాయల నుండి 250 కిట్లు బియ్యం, మంచి నూనె, కొబ్బెర, చింతపండు, బేడలు తదితర ఆహార పదార్థాలతో కిట్లుగా తయారు చేసి పారదర్శకంగా ఎన్నిక చేసిన కుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

 


కల్పనా కుమారి మాట్లాడుతూ ఆల్ మేవ మంచి కార్యక్రమం నిర్వహించిందని, పేదవారికి రమజాను కిట్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అందరు మాస్కులు ధరించాలని, ఇంటికి వెళుతునే చేతులను శానిటైజ్ చేసుకోవాలని హితవు పలికారు. అధ్యక్షకార్యదర్శులు ఇమ్రాన్, సలీం మాట్లాడుతూ ఈకార్యక్రమంలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముహమ్మద్ రఫీ, సైఫుల్లాహ్, జాకీర్, మాలిక్ బేగ్, లతీఫ్, గౌస్, ఆబీద్, కరీం, అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు.


 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: