సీఎం జగన్ రెండో స్థానంలో నిలవడం..
ఆంధ్రులకు దక్కిన గౌరవం
డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ తో వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)సీఎం జగన్ మరోసారి అరుదైన గౌరవం దక్కింది.' ఆర్ మ్యాక్స్ మీడియా' వెల్లడించిన ర్యాంక్ ల జాబితాలో ఆయనకు రెండోస్థానం దక్కింది. ఈ సందర్బంగా 'ముఖ్యమంత్రి ఆమోదం' రేటింగ్ - నెలవారీ సర్వేలో జగన్ గారు రెండో స్థానంలో నిలవడం శుభపరిణామనని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కారణంగానే ముఖ్యమంత్రికి ఈ గౌరవం దక్కిందని చెప్పారు. మహామహులైన పినరన్ విజయన్, మమతా బెనర్జీని వెనక్కి నెట్టి అగ్రభాగాన జగన్ నిలవడం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం అన్నారు ఏలూరి. ఈ ఘనతకు కారణం ఆయన నమ్మిన సిద్ధాంతం, ముక్కుసూటితనమే.. ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికలు అయిపోయిన తరువాత ఒకలాగా మాట్లాడే నాయకులున్న ఈ రోజుల్లో మాట మీద నిలబడే నాయకుడు కాబట్టే జగన్ కు ఇంతటి ప్రజాధారణ లభించిందని అన్నారు.
గతంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే రాజకీయ నాయకుల చుట్టూ తిరగాలని.. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి కనుమరుగైందని.. వాలంటీర్ల ద్వారానే ప్రజలకు అన్ని సేవలు అందుతున్నాయని చెప్పారు.. అందువల్లే ముఖ్యమంత్రికి పెద్దఎత్తున ఆమోదం లభించిందని సంతోషంతో చెప్పారు ఏలూరి. ఎక్కడా కూడా అవినీతికి ఆష్కారం లేకుండా ఏపీలో సంక్షేమాభివృద్ధి జరుగుతుంది.. అందుకే గతంలో కూడా చాలా సంస్థలు ముఖ్యమంత్రి పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. కరోనా విషయంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని పనిని వైఎస్ జగన్ చేసి చూపించారు.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి ఒక్కరికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ఈ పనిని దేశప్రజలు సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారని రామచంద్రారెడ్డి చెప్పారు.
Post A Comment:
0 comments: