మాతృభూమి కోసం అసువులు బాసిన అమరుడు...
టిప్పు సుల్తాన్ షహీద్ వర్దంతి సభలో వక్తలు
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయంలో టిప్పు బ్రిగేడ్ ఆధ్వర్యంలో ముస్లిం నగారా అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన మాతృభూమి కోసం అసువులు బాసిన అమరవీరుడు టిప్పు సుల్తాన్ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పుస్పాంజలి ఘటిస్తూ కీర్తిస్తూ ఘనంగా జరుపుకున్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ దుష్ట ఆంగ్లేయులు భారత దేశాన్ని కబళించి క్రూర హననం జరుపుతున్నప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన యోధుడు టిప్పు సుల్తాన్ అని శృంగేరి పీఠాన్ని మరాఠా లు ధ్వంసం చేసి నగలు దోచుకెళ్లినప్పుడు శృంగేరి పీఠాన్ని పునరుద్ధరించి మతసామరస్యం
పీడిత సామాజిక వర్గం మహిళలకు నగ్నంగా చన్నుమీద పన్ను అనే దుర్మార్గ ఆటవిక పన్నును రద్దు చేసి అచ్చాదనం నిండుగా వస్త్రాలు కప్పుకొనే లా మహిళలఆత్మ గౌరవ చట్టం చేసి సమానత్వాన్ని ప్రదర్శించి. హిందూ దేవాలయాలకు సహకారాన్ని అందజేసి సోదర భావం చాటి దేశభక్తి చాటిన వీరుడు టిప్పు సుల్తాన్ అని కొనియాడారు మనం కూడా ఇలాంటి మహనీయుల కు ఆదర్శoగా కుల మతాలకు వర్గ వర్ణాలకు అతీతంగా వసుధైక కుటుంబ నిర్మాణానికి నడుం బిగి oచాలన్నారు ఈ కార్యక్రమంలో టిప్పు బ్రిగేడ్ పట్టణ అధ్యక్షుడు అతీఖుర్రహమాన్. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం సభ్యులు జబీఉల్లాఖాన్.ఇనాయతుల్లా. టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు సుల్తాన్. అబ్దుల్ మాలిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: