సేవాధ్రృక్పధానికి.. సహనానికి.. పవిత్రతకు..
ప్రతీక రంజాన్ పర్వదినం
మార్కాపురం జిల్లా బాలుర ఉన్నత పాఠశాల
ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖరరెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖరరెడ్డి తమదైన శైలిలో పండుగ విశిష్టతను అందరికి అర్ధమయ్యేరీతిలో వివరిస్తూ, హ్రృదయపూర్వక శుభాకాంక్షలతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన రంజాన్ సందేశం ఇలావుంది. క్రమశిక్షణ.. ధాత్రృత్వం..ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత.. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపేందుకు దైవం పంపిన పరమ పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో... నెలరోజులుగా కఠోర దీక్షతో.. నిష్టగా అల్లాను ఆరాధిస్తూ.. ఆధ్యాత్మిక జీవనం ద్వారా అల్లా రక్షణ.. కరుణ.. లక్ష్యం గా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి... ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతో కొంత దానధర్మాలు చేయడం వల్ల.. సేవాధ్రృక్పధానికి.. సహనానికి.. పవిత్రతకు.. ప్రతీకగా .. జీవిత సాఫల్యం గా.. సుఖశాంతులకు.. మతసామరస్యానికి చిహ్నం.. ఈ ఈద్ ఉల్ ఫిత్ర్( రంజాన్)పండుగ.. ఏ నెలవంకనైతే చూసి పవిత్ర ఉపవాసాలు ప్రారంభించారో .. అదే నెలవంకను మళ్లీ నెలరోజుల తర్వాత చూసి మదినిండా త్రృప్తితో దీక్షలకు వీడ్కోలు పలుకుతూ... ఆకలి దప్పికకు ఉన్న ప్రాధాన్యతను అవలోకనం చేసుకుని.. నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో గడిపిన ముస్లిం సోదరులకు మరియు సోదరిమణులకు ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా హ్రృదయపూర్వక శుభాకాంక్షలు. అని మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయేతర సిబ్బంది. విద్యార్థులు తెలియజేశారు.
Post A Comment:
0 comments: