ప్రజలను చైతన్యవంతం చేద్దాం 

 - కరోనాను కట్టడి చేద్దాం

- మునిసిపల్ చైర్మన్ మాబూనిసా 


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రజలను చైతన్యవంతం చేసి కరోనాను కట్టడి చేద్దామని నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ మాబున్నీసా అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోని సమీక్ష సమావేశం భవనంలో డాక్టర్లకు,  సచివాలయ హెల్త్ వర్కర్లకు, ఆశా వర్కర్లకు, నర్సులకు నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ మాబున్నీసా, ఉపాధ్యక్షులు గంగిశెట్టి శ్రీధర్, ఇంచార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి,  మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాబున్నీసా మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోన వల్ల ప్రజలను ఇబ్బంది పెడుతుందని, దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత  అందరిపై ఉందన్నారు. ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన డాక్టర్లు, నర్సులు,  ఆశా వర్కర్లు, సచివాలయ హెల్త్ వర్కర్లు పట్టణంలోని ప్రజలను చైతన్యవంతులుగా చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూచనలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇంచార్జి డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణలు  మాట్లాడుతూ కరోనా కట్టడి కొరకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని వాటన్నిటిని ప్రజలకు తెలియజేయాలన్నారు.

నంద్యాల పట్టణంలో ఫీవర్ సర్వే జరుగుతతుందని, ఈ సర్వేలో ప్రతిరోజు సిబ్బంది ప్రజల వద్దకు వెళ్లి కరోనాకు సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారని,  అనుమానితులను గుర్తించి వారు కరోనా పరీక్షలు చేసుకునేలా చూడాలని, పాజిటివ్ వచ్చిన వారిని కోవిడ్ కేర్ సెంటర్ లో చేర్చి మెరుగైన వైద్యం, పోషక విలువలు  కలిగిన ఆహారం అందిస్తున్నామని,  కరోన పాజిటివ్ వచ్చినవారు కోవిడ్ కేర్ సెంటర్ లోకి వచ్చి వారం పాటు ఉన్నట్లయితే వారికి వైద్యం అందించి ఆరోగ్యంగా ఉంచి పంపడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, మొదటి  డోసు  తర్వాత  రెండవ డోసు ఆరు వారాల తర్వాత  వేయించుకోవాలని, నంద్యాల పట్టణంలోని జిల్లా స్థాయి ఆస్పత్రిలోని ఖాళీ స్థలంలో కోవిడ్ కేర్ సెంటర్ ఆవరణంలో జర్మన్  షేడ్స్  తాత్కాలికంగాఏర్పాటు చేస్తుందన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: