పార్టీ పునర్ నిర్మాణం ఊపందుకోవాలి
కాంగ్రెస్ నేత జి.నిరంజన్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడినా పార్టీ పునర్ నిర్మాణం ఊపందుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ వర్కింగ్ కమిటి జూన్ 23 న పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించినా, దేశములో ప్రస్తుతము నెలకొన్న కోవిద్ పరిస్తితుల దృష్ట్యా వచ్చిన సూచనల మేరకు వాయిదా పడ్డా, పార్టీని పునర్నిర్మించి పటిష్టము చేయడములో ఎటువంటి జాగుచేయ వద్దు. సమావేశ ప్రారంభములో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధి ఈ మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో ఆశించిన పలితాలు రాక పోవడము పట్ల విచారము వ్యక్తపరచడమే, కాకా నిర్మొహమాటంగా మాట్లాడి, ఓటమికి కారణాలను విచారించి నివేదించటానికి ఒక కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. సొనియా గాంధి గారు మాట్లాడిన మాటల తీరు కాంగ్రెస్ శ్రేణులలో విశ్వాసాన్ని నింపి భరోసా కల్పించిది. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుని కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపాలి. అని ఆయన కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: