చంపేస్తోంది భయమే...కరోనా కాదు

ఆత్మవిశ్వాసమే ప్రాణాలను నిలుపుతుంది

ఆ ధైర్య పడొద్దు...అశ్రద్ద కూడా చేయోద్దు

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది.. అయితే ఈ మరణాల్లో కొంతవరకూ ఆక్సిజన్ అందకనో, కరోనా తీవ్రతతోనో మరణిస్తున్నారు. అయితే సెకండ్ వేవ్ మరణాల్లో చాలా వరకూ భయం కారణంగా కూడా మరణిస్తున్నారని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు కారణం.. వైరస్‌ సోకితే మరణం తప్పదన్న ఆందోళన కొంతమంది రోగులలో ఆవహించి ఉంటుందని.. పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు.. తనకు వైరస్ సోకితే  డాక్టర్లు, కుటుంబీకులు పట్టించుకోరన్న నిరాశ కూడా రోగిలో ఏర్పడుతుందని ఈ భయాలు అన్ని కలిసి కరోనా సోకిన వ్యక్తిని కృంగదీస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే అన్నారు ఏలూరి. వైద్యంతోనే కాకుండా ధైర్యం వలన కూడా కొవిడ్‌ తగ్గుతుందని స్పష్టం చేశారు.. రోగిలో ఆవహించిన  భయాన్ని పోగొట్టినట్టయితే  వైరస్ ను దాదాపు జయించినట్టేనని చెప్పారు. సరిగ్గా కోవిడ్ సోకిన పది రోజులు మనసును స్థిమితంగా ఉంచుకుంటే, మళ్లీ మనుపటి మనిషిలా చురుగ్గా మారతారని స్పష్టం చేశారు. ఎప్పుడైతే రోగిలో భయం ఆవహిస్తుందో అప్పుడు.. శరీరంలో వచ్చే  మార్పుల కారణంగా ఇమ్మ్యూనిటీ పవర్ ను కోల్పోతారని దాంతో వైరస్ తీవ్రం అవుతుందని   డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అందువల్ల కోవిడ్ సోకింది కదా అని కుంగిపోకుండా    ధైర్యాన్ని నూరిపోసుకోవాలని సూచించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: