మామిళ్లపల్లి ఘటన బాధాకరం
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
కడప జిల్లా మామిళ్లపల్లిలో క్వారీకి తరలిస్తున్న జిలెటిన్ పేలి 10 మంది మరణించడం బాధాకరమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఆ క్వారీ తవ్వకం చట్టబద్ధంగా సాగుతోందా లేదా అన్నదానిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
Post A Comment:
0 comments: