రంజాన్ పర్వదినం సందర్భంగా,,,

మీర్జా షంషీర్ అలీభేగ్ చారిటీబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో మీర్జా షంషీర్ అలీభేగ్ చారిటీబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిర్ దాస్ నగర్ కాలనీలో బుధవారం రంజాన్ మాసం పర్వదినం సందర్భంగా గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్, వైసీపీ రాష్ట్ర సెక్రటరీ యమ్ షంషీర్ అలీభేగ్  తన వంతు బాధ్యతగా ముస్లిం మహిళలకు చీరలు, మత పెద్దలకు బట్టలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి పట్టణంలో విజృంబిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని తెలిపారు. ఇంటి నుండి బయటకు వెళ్లి వచ్చిన తరువాత ఖచ్చితంగా చేతులు, కాళ్ళు శుభ్రపరచుకోవాలని తెలిపారు.

హోమ్ ఐసొలేషన్ లో ఉన్నవారికి ఎలాంటి సహాయం అందించటానికి అయినా మా టీమ్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చూస్తున్నారని, స్థానిక ఎమ్. ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజల బాగోగుల గురించి తెలుసుకుంటూ, అందరికీ వైద్యసేవలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అంతే కాకుండా కార్యనిర్వహకులు ఎమ్. జాఫర్ అలిబేగ్ గారు ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, అవగాహన కల్పిస్తున్నారన్నారు.

అందరూ ధైర్యంతో ఉండేలా భరోసా కల్పిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమములో  మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జున రెడ్డి, ఏ1 గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్, వైసీపీ రాష్ట్ర సెక్రటరీ యమ్ షంషీర్ అలీభేగ్, రాష్ట్ర బిసి జనసభ  ప్రధాన కార్యదర్శి పీఎల్పీ యాదవ్, కార్యక్రమ నిర్వహొకులు యమ్ జాఫర్ అలీభేగ్, సిబ్బంది పాల్గొన్నారు.


 
 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: