కమిషనర్ సేవలు ప్రశంసనీయం....
అఖిలపక్షం అభినందనలు
కోవిడ్ లో విశిష్ట సేవలు అందిస్తున్న కమీషనర్ ను సన్మానించిన అఖిలపక్షం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావ్ చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయం అని కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాధిగ్రస్తులు దగ్గరికి వెళ్లి మనోధైర్యాన్ని కల్పిస్తు దాతల సహకారం తో వారికి ఆహారం మంచినీరు వంటివి అందిస్తున్నారని అలాగే పట్టణంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని వార్డుల్లో పట్టణంలోని రహదారుల్లో పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచి పరిశుభ్రం గా ఉంచగలుతున్నారని
పారిశుద్ధ్య కార్మికులు కు రాగి జావా అందించే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారాన్ని వారిపట్ల ప్రత్యేక శ్రద్దకనబరుస్తున్నారని సమయం తెలియక పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారని వారి సేవలు అభినందనీయమని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ఆయన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు ని కలిసి కోవిడ్ సమయంలో చేస్తున్న సేవలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు పలు అంశాలపై చర్చించారు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుద్దామని వారి ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని డ్రెస్ కోడ్ ఉండాలని వారికోసమే మున్సిపల్ విభాగం నుండి ప్రత్యేక నోడల్ అధికారి ని నియమించడం వంటివి చేయడం పై ఆలోచన చేయాలని వారు కమీషనర్ ని కోరారు ప్రధానంగా పట్టణంలో దశాబ్దాలుగా ఉన్న చాలా మురికి కాలువలను వెలికి తీశారని వాటిని శుభ్రపరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని తెలిపారు.
అనంతరం ఆయన్ను శాలువా తో సత్కరించి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ హిందూపురం లో కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నామని అందరూ ముందుకొస్తారని స్వచ్ఛంద, సేవా సంస్థలు అన్ని రాజకీయపార్టీల వారు సేవలు అందిస్తున్నారని ఇది చాల మంచి సంప్రదాయమని అందురు కలిసికట్టుగా వుండి ఆపదలో ఉన్నవారికి సాయం అందిస్తూ ప్రజలకి కోవిడ్ పట్ల చైత్యన్యం కలిగిస్తూ కోవిడ్ బారిన నుండి అందరూ రక్షింపబడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ జబిఉల్లా అఖిలపక్షం నాయకులు బాలాజీమనోహర్ ఫ్లోర్ లీడర్ డి.ఇ.రమేష్ కుమార్, బీఎస్పీ శ్రీరాములు ముస్లిం నగారా రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మర్ ఫారూఖ్, సీఐటీయూ వెంకటేష్ రాము కౌన్సిలర్లు, నాయకులు ఆసీఫ్ సతీష్ కుమార్ దుర్గానవీన్ నాగేంద్ర హరీష్ అమానుల్లా సమీవుల్లా దారుల్ యతామాఅధ్యక్షుడు రియజుల్లా ఖాన్.టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జబీఉల్లా ఖాన్.హరి తదితరులు పాల్గోన్నారు.
Post A Comment:
0 comments: