సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతనీయం
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
న్యాయస్థానాల్లోని కార్యకలాపాలపై వార్తలు రాయకుండా మీడియాను నియంత్రించలేని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షించదగ్గ విషయమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, వాటి పాత్రను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొనడం స్వాగతనీయమని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా నడుచుకుంటాయని ఆయన అన్నారు. లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థే కుప్పకూలుతుంది అని పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: