రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలి

కోవిడ్ అంతమవ్వాలని దువా చేయండి

దాల్ మిల్ అమీర్ ఆధ్వర్యంలో ఈద్ కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే శిల్పా

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రానున్న రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బొమ్మలసత్రం సమీపంలోని ఎస్ జీ ఆర్ దాల్ మిల్లులో వైస్సార్సీపీ నాయకుడు, పారిశ్రామికవేత్త అమీర్ బాష ఆధ్వర్యంలో ఘట్టాల్ నగర్, గాంధీ నగర్, బొగ్గులైన్ ప్రాంతాల్లోని పేద ప్రజలకు రంజాన్ ఈద్ కిట్లు, చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం నుండి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ నేపథ్యంలో ప్రజలందరూ పండుగలను ఇళ్ల వద్దే చేసుకుంటున్నారన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారిన ప్రస్తుత సమయంలో ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రభుత్వం సూచించిన భౌతిక దూరం పాటించడం, మాస్కుల వాడకం తప్పనిసరని ఎమ్మెల్యే అన్నారు.

 


ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో పారిశ్రామికవేత్త అమీర్ బాష  ముందుకొచ్చి ఈద్ కిట్లను అందించడం శుభ పరిణామమని అన్నారు. ప్రపంచం నుండి కరోనా మహమ్మారి అంతమవ్వాలని ప్రతిఒక్కరు ప్రార్థనలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ బాష, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరీంలు మాట్లాడుతూ ఇస్లాం మతంలో అభాగ్యులకు అండగా నిలబడాలనే నియమంలో భాగంగా పారిశ్రామికవేత్త అమీర్ బాష నిరుపేదలైన ఆరువందల కుటుంబాలకు నూతనవస్త్రాలతో  పాటుగా పండుగను సంతోషంగా జరుపుకునేందుకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించారన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భాస్కర్ రెడ్డి, పాంషావలి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కిరణ్, నాయకులు బషీర్, ఖాద్రి, సుబాహాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: