నంద్యాల జిల్లాస్థాయి ఆస్పత్రి ఆవరణంలో,,

జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి

జిల్లా ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లాస్థాయి ఆస్పత్రి ఆవరణంలో ని  ఖాళీ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయంకొరకు  అదనపు బెడ్స్ కల్పించేందుకు... అన్ని  వసతులతో కూడిన జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ ఏర్పాట్ల పనులను పరిశీలించినము అని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వసతులతో కూడిన జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ ఏర్పాట్ల పనులను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్,  డిసిహెచ్ఎస్ రామకృష్ణతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసే నిమిత్తమై ఈరోజు నంద్యాల పట్టణంలోని జిల్లాస్థాయి ఆస్పత్రి ఆవరణలో, నంద్యాల శివార్లలోని కోవిడ్ కేర్ సెంటర్ల నందు జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు.

ఈ పనులను కూడా వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో బెడ్స్, ఏసీ, వాటర్, మందులు, పవర్ సప్లై, శానిటేషన్, ఆక్సీజన్ బెడ్స్ తదితర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి మ్యాన్ పవర్ సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయ్ కుమార్, డిసిహెచ్ఎస్ రామకృష్ణలను ఆదేశించామన్నారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ రవికుమార్ తదితరులు ఉన్నారు.


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: