చికాగో అమరుల ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు 

(జానోజాగో వెబ్ న్యూస్-నంది కొట్కూరు ప్రతినిధి)

కార్మిక దినోత్సవమైన 135 మేడే సందర్భంగా ఐ ఎఫ్ టి యు  నాయకత్వంలో శాంతి థియేటర్ నుండి వందలాది కార్మికులతో పాత బస్టాండ్ పటేల్ సెంటర్ కే జి రోడ్ కొత్త బస్టాండ్ వరకు భారీ  ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం పటేల్ సెంటర్ నందు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జెండాను వివిధ సెంటర్లలో ఐ ఎఫ్ టి యు జెండాలను ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు నరసింహులు ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ వీరు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై చికాగో  అమరవీరుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని వారు తెలిపారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో పోరాడి కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా అమలు చేసి కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి బానిసలుగా మార్చింది. అదేవిధంగా దేశానికి ఆయువుపట్టు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే  ప్రయత్నం చేస్తుంది. మరియు దేశానికి అన్నం పెట్టే రైతేరాజు అని జై జవాన్ జై కిసాన్ అంటూ ఎన్నికల్లో ప్రకటన చేయడం తప్ప రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. రైతుల నుండి వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పిన ప్రయత్నం లో భాగంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రాజ్యాంగానికి విరుద్ధంగా అంగ బలం తో చట్టం అమలు చేయడం జరిగింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంలో 150 రోజులు నుండి రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి కనబడలేదు.మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు దేశ ప్రజలపై ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు నిత్యవసర వస్తు ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయు పట్టులాంటి  విశాఖ ఉక్కు పరిశ్రమను  ప్రైవేటీకరణకు పూనుకుంది. కావున దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ఉద్యోగులు ప్రజాస్వామిక వాదులు ప్రజలు నరేంద్రమోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం కాగలవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్  జిల్లా కోశాధికారి ఎం  గోపాల్, పి డి ఎస్ యు జిల్లా నాయకులు శేఖర్ నాయుడు, పీ వై ఎల్ జిల్లా నాయకులు యూ నవీన్ కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మద్దిలేటి, ఐ ఎఫ్ టి యు  డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ వెంకటేశ్వర గౌడ్, తిక్కయ్య, ఫ్రూట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రాజు, కూరగాయల మార్కెట్ యూనియన్ నాయకులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు, తిమ్మన్న, ఏ ఐ కె ఎమ్ ఎస్ ఐ ఎఫ్ టి యు నాయకులు  రమణయ్య శెట్టి, ఎల్ల నాయుడు ,పుల్లన్న,కంపన,ఆటో గని హమాలి మున్సిపల్ కార్మికులు తదితర యూనియన్ నాయకులు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: