గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి

సీపీఎం నేత దగ్గుపాటి సోమయ్య


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాల ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో వెంటనే గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికపై చేపట్టాలి. సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాల ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం జరిగింది. మార్కాపురం రెవెన్యూ డివిజన్ మరియు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో నిరంతరం గర్భిణీ స్త్రీలు మార్కాపురం జిల్లా వైద్యశాలకు వస్తూ ఉంటారు. జిల్లా వైద్యశాల ను కోడ్ ఆసుపత్రిగా పూర్తిస్థాయిలో మార్చి వేయడం జరిగింది. సాధారణ రోగుల మరియు గర్భిణీ స్త్రీలకు ప్రవేశం లేకపోవడంతో ముఖ్యంగా వెనుకబడిన మార్కాపురం ప్రాంతంలో పేద వ్యవసాయ కూలీలు ,కార్మికులు, దళితులు, బలహీన వర్గాల కుటుంబాల నుండి వచ్చిన గర్భిణీ స్త్రీలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం వేల రూపాయలు ఖర్చు చేయడం భరించలేని ఖర్చుతో కూడుకున్నదని, వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మార్కాపురం మండల తహసీల్దార్ విద్యాసాగర్ గారికి సిపిఎం నాయకులు అర్జీ అందజేయడం జరిగింది. అర్జీ అందజేసిన వారిలో సి.పి.ఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య మరియు  ప్రాంతీయ కమిటీ నాయకులు డీకేయం రఫీ, ఏనుగుల సురేష్ కుమార్ , జనుమాలనాగయ్య తదితరులు ఉన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: