ఆంక్షల మధ్య నిరాడంబరంగా,,,

ఈద్ చేసుకున్న ముస్లింలు


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కరోనా కట్టడిలో ఆంక్షల మధ్య మజీదుకే పరిమితమయి ముస్లింలు నిరాడంబరంగా ఈద్ చేసుకున్నారు. స్థానిక మజీదుల్లో బ్యాచులుగా ఈద్ ప్రార్ధనలు ఆచరించారు. భీమవరం రోడ్డులోని ఫుర్ఖాన్ మజీదులో హాఫీజ్ అబ్దుల్ హాదీ, బస్టాండ్ మజీదులో మౌలానా అబ్దుల్ ఖదీర్, మదీనా మజీదులో మౌలాన అబ్దుల్ షుకూర్, కుబ్రాలో హాఫీజ్ అమ్జద్ బాషా, ఖురైష్ మజీదులో హాఫీజ్ ఇసాఖ్, అంటికోటలో హాఫీజ్ హబీబుల్లాహ్, మస్జిద్ రసూల్ లో హాఫీజ్ సలీం, జుమా మజీదులో మౌలాన రఫీ, డబరేవాలి మజీదులో మౌలాన ఖాజహుసేన్,

బొమ్మ సత్రం మజీదులో మౌలానా మహబూబ్ బాషా, పోలీస్ లైన్ మజీదులో మౌలానా అబ్దుల్ గఫూర్, లతీఫియాలో మౌలానా ముస్తాఖ్ తదితర నలభై మజీదుల్లో ఇమాములు ఈద్ నమాజ్ చేయించారు. ఈ సంధర్భంగా జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని మజీదుల్లో కరోనా వ్యాధిని అంతం చేయాలని ప్రార్ధించి పాలస్తీనా వాసులపై జరిగే దాడిని వ్యతిరెకిస్తు అమాయక పాలస్తీనా ప్రజలకు కాపాడాలని ప్రార్ధించారు. అన్ని మజీదుల్లో ప్రజలు స్వచ్ఛందంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ నమాజులు ఆచరించారని సమద్ తెలిపారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: