నాకిదే ఫస్ట్ టైమ్...

  ఊర్వశి విడుదల


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

శ్రీవల్లిక ఫిలిమ్స్ పతాకంపై రాంరెడ్డి ముస్కు దర్శకత్వంలో కురుపాల విజయ్ కుమార్ ముదిరాజ్ నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం "నాకిదే ఫస్ట్ టైమ్". ధనుష్ బాబు-సింధూర రౌత్-కావ్యకీర్తి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 5 నుంచి ఊర్వశి ఓటిటిలో ప్రసారం కానుంది.

    ఈ సందర్భంగా నిర్మాత కురుపాల విజయ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ... "టీనేజ్ ఆడియన్స్ తోపాటు... మిగతా ఏజ్ గ్రూప్స్ ని సైతం అమితంగా ఆకట్టుకునే చిత్రం 'నాకిదే ఫస్ట్ టైమ్". మా దర్శకుడు రాంరెడ్డి ప్రతి సన్నివేశం ఎంతో చక్కగా తెరకెక్కించాడు. మా హీరో ధనుష్ బాబుకి మంచి పేరు తెస్తుంది. మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ చేరువ చేస్తున్న "ఊర్వశి ఓటిటి" వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విజయ్ కురాకుల సంగీతం మా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ" అని అన్నారు.

     ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చరణ్ అక్కల, కూర్పు: నందమూరి హరి, సంగీతం: విజయ్ కురాకుల, నిర్మాత: కురుపాల విజయ్ కుమార్ ముదిరాజ్, దర్శకత్వం: రాంరెడ్డి ముస్కు!!


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: